మురళీ మోహన్ జయభేరి కన్ స్ట్రక్షన్స్ కు ఏపీ సర్కారు భారీ జరిమానా
- అమరావతి సమీపంలో జయభేరి నిర్మాణాలు
- కుంచనపల్లిలో 7 ఎకరాల 5 సెంట్ల స్థలం కొనుగోలు
- 2016లో నిర్మాణాలు
- వ్యవసాయభూమిని కమర్షియల్ ల్యాండ్ గా మార్చలేదన్న ప్రభుత్వం
- రూ.1 కోటి జరిమానా
- రూ.50 లక్షల అపరాధ రుసుం
జాతీయ రహదారి పక్కనే ఉండే కుంచనపల్లిలో 7 ఎకరాల 5 సెంట్ల భూమిని కొనుగోలు చేసిన జయభేరి కన్ స్ట్రక్షన్స్ 2016లో నిర్మాణాలు చేపట్టింది. అయితే, ఇది వ్యవసాయ భూమి కాగా దీంట్లోనే నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో నిబంధనలు పాటించలేదని జయభేరి కన్ స్ట్రక్షన్స్ పై ప్రస్తుత ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
రంగంలోకి దిగిన అధికారులు 3 శాతం ల్యాండ్ కన్వర్షన్ ఫీజుతో పాటు జరిమానా కూడా విధించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినందుకు రూ.1 కోటి, అపరాధ రుసుం కింద మరో రూ.50 లక్షలు చెల్లించాలని జయభేరి కన్ స్ట్రక్షన్స్ ను ఆదేశించారు. ఈ జరిమానాను జయభేరి సంస్థ చెల్లించినట్టు తెలుస్తోంది.