sen: ఈరోజు కూడా భారీ లాభాలను మూటగట్టుకున్న మార్కెట్లు

  • వరుసగా రెండో రోజు 500 పాయింట్లకు పైగా లాభాలను మూటగట్టుకున్న సెన్సెక్స్
  • మెటల్స్, బ్యాంకెక్స్ సూచీల అండతో దూసుకుపోయిన మార్కెట్లు
  • 558 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
Sensex closes 558 points high

నిన్న భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా అదే ట్రెండ్ ను కొనసాగించాయి. మెటల్, బ్యాంకింగ్ స్టాకుల కొనుగోళ్లకు మదుపుదారులు మొగ్గు చూపడంతో ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు లాభాల్లోనే పయనించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 558 పాయింట్లు లాభపడి 48,944కి చేరుకుంది. నిఫ్టీ 168 పాయింట్లు ఎగబాకి 14,653కి పెరిగింది. బీఎస్ఈ సూచీలన్నీ ఈరోజు లాభాల్లోనే ముగిశాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (3.33%), బజాజ్ ఫైనాన్స్ (3.02%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.66%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.66%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.48%).

టాప్ లూజర్స్:
మారుతి సుజుకి (-1.24%), ఎన్టీపీసీ (-0.54%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-0.53%), నెస్లే ఇండియా (-0.34%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-0.27%).

More Telugu News