Ministers Committee: ఏపీలో కరోనా పరిస్థితులపై రేపు మంత్రుల కమిటీ సమావేశం

  • కరోనా నియంత్రణ చర్యల పర్యవేక్షణకు కమిటీ
  • ఐదుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
  • గత నెలలో ఓసారి సమావేశమైన కమిటీ
  • రేపు మరోసారి సమావేశం అవుతున్నట్టు ఆళ్ల నాని వెల్లడి
  • కరోనా కట్టడి చర్యలపై సమీక్ష
AP Ministers Committee will meet tomorrow

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించేందుకు మంత్రుల కమిటీ రేపు సమావేశం కానుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. ఈ కమిటీకి ఆళ్ల నాని కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. కొవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడానికి తీసుకుంటున్న చర్యలపై పర్యవేక్షణ కోసం ఏపీ సర్కారు ఐదుగురు మంత్రులతో ఇటీవలే కమిటీ వేసింది. ఆళ్ల నాని కన్వీనర్ కాగా... బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు ఈ కమిటీలో సభ్యులు.

తాజాగా ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ, రేపటి సమావేశంలో కీలకమైన అంశాలను చర్చిస్తామని తెలిపారు. ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సినేషన్, రెమ్ డెసివిర్ అంశాలపై చర్చిస్తామని పేర్కొన్నారు. కాగా, మంత్రుల కమిటీ గత నెలలోనూ సమావేశమై కొవిడ్ నియంత్రణ చర్యలపై సమీక్ష చేపట్టింది.

More Telugu News