Sangam Dairy: ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పరిధిలోకి సంగం డెయిరీ

  • తొలుత పాల ఉత్పత్తిదారుల సంఘానికి సంగం డెయిరీ బాధ్యత
  • ఉత్తర్వులు జారీ
  • సంగం డెయిరీపై ఏసీబీ నివేదిక
  • ఉత్తర్వులు వెనక్కి తీసుకున్న సర్కారు
  • సంగం డెయిరీ బాధ్యతలు కార్పొరేషన్ కు అప్పగింత
  • తాజా ఉత్తర్వులు జారీ
AP Govt issues orders on Sangam Dairy

సంగం డెయిరీని గుంటూరు పాల ఉత్పత్తిదారుల సహకారం సంఘం పరిధిలోకి తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకుంది. జీవో 515ని రద్దు చేసింది. సంగం డెయిరీని ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పరిధిలోకి తెస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, సంగం డెయిరీ కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతను తెనాలి సబ్ కలెక్టర్ కు కట్టబెట్టింది. సంగం డెయిరీ రోజువారీ కార్యకలాపాలకు ఎవరైనా అడ్డుతగిలితే చర్యలు తీసుకునే అధికారాలను కూడా సబ్ కలెక్టర్ కు అప్పగించింది.

సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ చైర్మన్ గా ఉన్న టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను ఏసీబీ అరెస్ట్ చేయడం తెలిసిందే. సంగం డెయిరీ వ్యవహారాలపై ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ నివేదిక ఆధారంగానే తాజా ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రభుత్వం తెలిపింది.

More Telugu News