బీజేపీ బాధితురాలిగా భారత్ ను మార్చొద్దు: రాహుల్ ఫైర్

26-04-2021 Mon 13:35
  • ఇప్పటి వరకు వ్యాక్సిన్ పై జరిగిన చర్చ చాలు
  • అందరికీ వ్యాక్సిన్ ను ఉచితంగా అందించాలి
  • కరోనా రహితంగా దేశాన్ని మార్చేందుకు ఈ పని చేయాల్సిందే
Make Covid Vaccines Free demands Rahul Gandhi

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మీ పార్టీ బాధితురాలిగా దేశాన్ని మార్చవద్దని ఆయన కోరారు. కరోనా, కోవిడ్ వ్యాక్సిన్లపై ఇప్పటి వరకు జరిగిన చర్చ చాలని... దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ను పూర్తిగా ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. దేశాన్ని కరోనా రహితంగా మార్చడానికి ఈ పని చేయాల్సిందేనని చెప్పారు. దేశాన్ని మీ పార్టీ బాధితురాలిగా మార్చవద్దని అన్నారు.

కరోనా వ్యాక్సిన్ ను తయారు చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ లు వాటి ధరలను అమాంతం పెంచేసిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ ఆసుపత్రులకు ఒక డోసు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను రూ. 600, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 400కు ఇవ్వనున్నట్టు సీరమ్ ప్రకటించింది. భారత్ బయోటెక్ విషయానికి వస్తే.. కోవాగ్జిన్ ను రాష్ట్ర ప్రభుత్వాలను రూ. 600కు, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ. 1,200కు ఇవ్వనున్నట్టు తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వానికి మాత్రం రూ. 150కే ఇస్తామని తెలిపింది. వ్యాక్సిన్ ధరలకు రెక్కలు వచ్చిన తరుణంలో రాహుల్ గాంధీ స్పందించారు.