Kolagatla Veerabhadra Swamy: విజయనగరం జిల్లాలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్
- ఏపీలో కరోనా మరింత తీవ్రం
- పదివేలకు పైగా రోజువారీ కేసుల సంఖ్య
- విజయనగరం ఎమ్మెల్యే వీరభద్రస్వామికి పాజిటివ్
- సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొరకూ అదే ఫలితం
- తమను కలిసినవాళ్లు పరీక్షలు చేయించుకోవాలన్న ఎమ్మెల్యేలు
ఏపీలో కరోనా రక్కసి స్వైరవిహారం చేస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు రెట్టింపవుతోంది. జిల్లాల్లో వెయ్యికిపైగా రోజువారీ కేసులు వస్తుండడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. తాజాగా విజయనగరం జిల్లాలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు.
విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొరకు కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో వారిరువురు ఐసోలేషన్ లోకి వెళ్లారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. గత కొన్నిరోజుల వ్యవధిలో తమను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు.