Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నపై జ్యోతిష్యాలయం నిర్వాహకుడు లక్ష్మీకాంత శర్మ ఫిర్యాదు... కేసు నమోదు!

Police Case on Teenmaar Mallanna
  • రూ. 30 లక్షలు డిమాండ్ చేశారు
  • ఇవ్వకపోవడంతో తప్పుడు కథనాలు
  • కేసును విచారిస్తున్నామన్న పోలీసులు
హైదరాబాద్ లోని సీతాఫల్ మండి ప్రాంతంలో మారుతి సేవా సమితి పేరుతో జ్యోతిష్యాలయం నిర్వహిస్తున్న లక్ష్మీకాంత శర్మ  ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు క్యూ టీవీ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పై కేసు నమోదు చేశారు. దాదాపు వారం క్రితం తనకు ఫోన్ చేసిన తీన్మార్ మల్లన్న, రూ. 30 లక్షలు తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేశారని, తాను ఇవ్వకపోవడంతో మరుసటి రోజు నుంచి తన చానెల్ లో అవాస్తవ కథనాలను ప్రసారం చేశారని లక్ష్మీకాంత శర్మ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తమకు 22న లిఖిత పూర్వక ఫిర్యాదు అందిందని, కేసును దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు.
Teenmar Mallanna
Lakshmikant Sharma
Police Case

More Telugu News