BJP: బెంగాల్ లో గెలిస్తే కరోనా వ్యాక్సిన్ ప్రీ అంటూ బీజేపీ హామీ... కౌంటర్ ఇచ్చిన టీఎంసీ

  • బెంగాల్ లో ఎన్నికల యుద్ధం
  • బీజేపీ, టీఎంసీ మధ్య మాటల తూటాలు
  • బీజేపీవి తప్పుడు హామీలన్న టీఎంసీ
  • బీహార్ ఎన్నికల్లోనూ ఇలాంటి హామీనే ఇచ్చారన్న టీఎంసీ
  • ఆ హామీ ఏమైందన్న టీఎంపీ ఎంసీ డెరెక్ ఓబ్రెయిన్
War of words between BJP and TMC in poll bound West Bengal

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటివరకు 6 విడతల పోలింగ్ ముగియగా, మరో రెండు విడతలు మిగిలున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, టీఎంసీ మధ్య మరోసారి మాటల యుద్ధం రేగింది. తాము గెలిస్తే బెంగాల్ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామని బీజేపీ హామీ ఇవ్వగా, అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ దీటుగా బదులిచ్చింది.

ఎన్నికలు పూర్తయ్యేవరకు బీజేపీ ఇలాంటి హామీలే ఇస్తుందని, ఆ హామీలను నమ్మవద్దని టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కూడా బీజేపీ ఇలాగే కరోనా వ్యాక్సిన్ ఇస్తామని హామీ ఇచ్చిందని, ఎన్నికలు ముగిశాక ఆ హామీ ఏమైందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. మిగిలిన రెండు విడతల ఎన్నికలు ముగిసేంత వరకు బీజేపీ పట్ల బెంగాల్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశ్చిమ బెంగాల్ లో ఏడో దశ పోలింగ్ ఈ నెల 26న, చివరిదైన ఎనిమిదో విడత పోలింగ్ ఈ నెల 29న నిర్వహించనున్నారు. మే 2న ఓట్ల లెక్కింపు చేపడతారు.

More Telugu News