Ramana: జస్టిస్ ఎస్ఏ బోబ్డేతో అనుబంధాన్ని మరువలేం: జస్టిస్ ఎన్వీ రమణ

  • పదవీ విరమణ చేసిన సీజేఐ ఎస్ఏ బోబ్డే
  • బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీడ్కోలు సభ
  • హాజరైన తదుపరి సీజేఐ ఎన్వీ రమణ
  • బోబ్డే మేధాశక్తి అమోఘమని కితాబు
Justice NV Ramana opines on retired CJI SA Bobde

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేడు పదవీ విరమణ చేసిన సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తదుపరి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ, జస్టిస్ ఎస్ఏ బోబ్డేతో అనుబంధాన్ని మరువలేమని అన్నారు. బోబ్డే మేధాశక్తి అమోఘమని కితాబునిచ్చారు. ఆయనకు భవిష్యత్తులో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. జస్టిస్ బోబ్డే ఈ-కోర్టులను పరిచయం చేశారని, కరోనా వేళ మౌలిక వసతుల కల్పనకు ఎంతో కృషి చేశారని కొనియాడారు.

ఇక దేశంలో కరోనా పరిస్థితుల గురించి మాట్లాడుతూ, బలమైన చర్యలతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కరోనా మహమ్మారితో పోరాడుతున్నామని, దేశానికి ఇది పరీక్షా సమయం అని పేర్కొన్నారు. వైరస్ కు ఎలాంటి భేదభావాలు లేవని, సుప్రీంకోర్టు జడ్జిలు, న్యాయవాదులు కూడా కరోనా బారినపడ్డారని వెల్లడించారు. కష్టకాలం అనేది మనల్ని మరింత బలంగా తయారుచేస్తుందని ఎన్వీ రమణ వివరించారు. దృఢమైన వ్యక్తిత్వం ఉన్న మనుషులు మంచి సమయాన్ని తిరిగి తెస్తారని అన్నారు.

More Telugu News