ఏపీలో ఒక్కరోజులో 11,766 కొత్త కేసులు... 10 లక్షలు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య

23-04-2021 Fri 19:12
  • ఏపీలో కరోనా విలయతాండవం
  • గత 24 గంటల్లో 45,581 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 1,885 కొత్త కేసులు
  • రాష్ట్రంలో 38 మంది మృతి
  • ఇంకా 74,231 మందికి చికిత్స
Corona scares AP and positive cases toll crossed one million mark
రాష్ట్రంలో కరోనా భూతం అన్ని వైపులా కోరలు చాచి విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో 45,581 కరోనా పరీక్షలు చేయగా 11,766 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,885 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 1,593... అనంతపురం జిల్లాలో 1,201... కర్నూలు జిల్లాలో 1,180... శ్రీకాకుళం జిల్లాలో 1,052 కేసులు గుర్తించారు. అదే సమయంలో 4,441 మంది కరోనా నుంచి కోలుకోగా 38 మంది కరోనాకు బలయ్యారు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే ఆరుగురు చనిపోయారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 7,579కి పెరిగింది.

ఇక, ఏపీలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా 10,09,228 కేసులు నమోదయ్యాయి. 9,27,418 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 74,231 మంది చికిత్స పొందుతున్నారు.