Punjab Kings: ముంబయితో మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

Punjab Kings won the toss and opts fielding against Mumbai Indians
  • ఐపీఎల్ నేడు ముంబయి వర్సెప్ పంజాబ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
  • చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్
  • విజయం కోసం తహతహలాడుతున్న పంజాబ్
  • ఇప్పటిదాకా 4 మ్యాచ్ లు ఆడి ఒక విజయం
ఐపీఎల్ లో నేడు ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఇప్పటివరకు 4 మ్యాచ్ లు ఆడి కేవలం ఒక్కదాంట్లోనే గెలిచిన పంజాబ్ జట్టుకు ఈ మ్యాచ్ లో గెలవడం చాలా ముఖ్యం.

 ఈ క్రమంలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి ముంబయిని తక్కువ స్కోరుకే కట్టడి చేసి, ఆపై లక్ష్యఛేదనలో సఫలం కావాలని కోరుకుంటోంది. అటు ముంబయి జట్టు ఇప్పటివరకు 4 మ్యాచ్ లు ఆడి రెండింట గెలిచింది.

ఈ మ్యాచ్ కోసం ముంబయి జట్టులో ఎలాంటి మార్పులు లేకపోగా... పంజాబ్ కింగ్స్ లెగ్ స్పిన్నర్ మురుగన్ అశ్విన్ స్థానంలో మరో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ని జట్టులోకి తీసుకుంది.
Punjab Kings
Mumbai Indians
Toss
MA Chidambaram Stadium
Chennai

More Telugu News