Rahul Gandhi: ఆక్సిజన్ కొరత, ఐసీయూ బెడ్స్ లేకపోవడం వల్ల చాలా మరణాలు సంభవిస్తున్నాయి: రాహుల్ గాంధీ

  • కేంద్ర స‌ర్కారుపై విమ‌ర్శ‌లు
  • కేంద్ర ప్ర‌భుత్వ విధానాల్లో లోపాలు
  • రోగుల్లో ఆక్సిజన్ స్థాయిని కరోనా తగ్గిస్తుంది
rahul gandhi slams govt

దేశంలో క‌రోనా ప‌రిస్థితుల‌పై  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మ‌రోసారి కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. రోగుల్లో ఆక్సిజన్ స్థాయిని కరోనా తగ్గిస్తుంద‌ని,  ఆక్సిజన్ కొరత, ఐసీయూ బెడ్స్ లేకపోవడం వల్ల చాలా మరణాలు సంభవిస్తున్నాయని ఆయ‌న అన్నారు. క‌రోనా విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వ విధానాల్లో లోపాల‌ వ‌ల్లే ఇలాంటి ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఢిల్లీతో పాటు ప‌లు రాష్ట్రాల్లో క‌రోనా కేసుల ఉద్ధృతి వ‌ల్ల ఆక్సిజ‌న్ కొర‌త ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పారిశ్రామిక అవ‌స‌రాల‌కు ఆక్సిజ‌న్‌ను వినియోగించకుండా మెడిక‌ల్ ఆక్సిజ‌న్ కొర‌తను తీర్చాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. అయిన‌ప్ప‌టికీ, డిమాండుకు తగ్గ‌ట్లు ఆసుప‌త్రుల‌కు ఇప్ప‌టికీ ఆక్సిజ‌న్ అంద‌ట్లేదు.

More Telugu News