కేటీఆర్ త్వరగా కోలుకోవాలి: చిరంజీవి

23-04-2021 Fri 12:07
  • కరోనా బారిన పడిన కేటీఆర్
  • హోమ్ ఐసొలేషన్ లో ఉన్నట్టు వెల్లడి
  • కేటీఆర్ త్వరగా కోలుకోవాలని వెల్లువెత్తుతున్న సందేశాలు
Get well soon KTR tweets Chiranjeevi

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్ లో ఉన్నానని ఆయన తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని... ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మరోవైపు కేటీఆర్ కు కరోనా సోకడంపై సినీ నటుడు చిరంజీవి స్పందించారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని చిరు ఆకాంక్షించారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలంటూ టీఆర్ఎస్ శ్రేణులు కూడా సోషల్ మీడియా ద్వారా సందేశాలను పంపుతున్నాయి.