Hospitals: కరోనా రోగులు వెంటనే వెళ్లిపోవాలని కోరుతూ... చేతులెత్తేస్తున్న ఢిల్లీలోని ఆసుపత్రులు!

  • పడకలు ఖాళీ లేవంటున్న ఆసుపత్రి వర్గాలు
  • అపోలో నుంచి మ్యాక్స్ వరకూ ఇదే పరిస్థితి
  • కొత్త అడ్మిషన్లకు నో చెబుతున్న ఆసుపత్రులు
No Beds for Corona Patients in New Delhi and NCR

వెల్లువలా వస్తున్న కరోనా రోగులకు సరిపడినంత వైద్య చికిత్సలను అందించలేమని, వారి చికిత్సకు అవసరమయ్యే మౌలిక వసతులు తమ వద్ద లేవని న్యూఢిల్లీతో పాటు, నేషనల్ కాపిటల్ రీజియన్ లోని ఆసుపత్రులు చేతులెత్తేస్తున్నాయి. వచ్చిన రోగులతో పాటు, ఆసుపత్రుల్లో ఉన్న వారిని కూడా వెళ్లిపోవాలని వైద్యులు కోరుతున్నారు. దేశ రాజధానిలో ప్రముఖ ఆసుపత్రులైన అపోలో, ఫోర్టిస్, మ్యాక్స్, సర్ గంగారామ్ వంటి ఆసుపత్రులన్నింటిలో ఇదే పరిస్థితి నెలకొని ఉండటం, పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

చిన్న ఆసుపత్రుల్లో సైతం ఇదే విధమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయని, కరోనా పేషంట్లు వస్తుంటే, తీవ్ర లక్షణాలు ఉన్న వారిని కూడా చేర్చుకునే పరిస్థితులు కనిపించడం లేదని వైద్య వర్గాలు వెల్లడించాయి. చాలా ఆసుపత్రుల్లో పడకలు ఖాళీ లేక కొత్త అడ్మిషన్లను తీసుకోలేక పోతున్నామని, ఎంతో మంది ఇన్ పేషంట్లుగా చేరడానికి ఆంబులెన్స్ ల్లోనే వేచి చూస్తున్నారని తెలుస్తోంది.

"వచ్చే రోగులకు జీవితాలను తిరిగి అందించాలనే మేము చూస్తున్నాం. అయితే, వారికి అవసరమైన ప్రాణ వాయువు మా వద్ద లేదు. అందుకే చాలా మంది చనిపోతున్నారు" అని కర్కర్ డోమ్ ప్రాంతంలోని శాంతి ముకుంద్ హాస్పిటల్ సీఈఓ సునీల్ కుమార్ సాగర్ వ్యాఖ్యానించారు. తమ వద్ద కొన్ని గంటలకు సరిపోయే ఆక్సిజన్ కూడా లేదని, ఈ ప్రభావం ఇప్పటికే చికిత్స పొందుతున్న 110 మంది రోగులపై పడనుందని వాపోయారు.

More Telugu News