ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన నితిన్ గడ్కరీ!

23-04-2021 Fri 09:25
  • నాగపూర్ కు 300 వెంటిలేటర్ల సరఫరా
  • అక్కడి ఆసుపత్రుల్లో తీవ్రమైన కొరత
  • మేకపాటికి ఫోన్ చేసిన గడ్కరీ
Nitin Gadkari Thanks AP Govt

కేంద్రం కోరగానే, మహారాష్ట్రలోని నాగపూర్ కు 300 వెంటిలేటర్లను పంపించినందుకు ఏపీ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి ఫోన్ కాల్ చేసిన గడ్కరీ, జగన్ కు కృతజ్ఞతలు తెలపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్ప సాయం చేసిందని అన్నారు. ఈ విషయాన్ని మేకపాటి స్వయంగా మీడియాకు వెల్లడించారు. కాగా, గడచిన వారం రోజుల వ్యవధిలో నాగపూర్ ఆసుపత్రుల్లో వెంటిలేటర్ల కొరత ఏర్పడగా, ఏపీ నుంచి సాయం చేయాలని కేంద్రం కోరింది. ఈ నేపథ్యంలో సానుకూలంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం వాటిని అందించిన సంగతి తెలిసిందే.