రెండు రోజుల నష్టాల నుంచి తేరుకున్న మార్కెట్లు

22-04-2021 Thu 17:54
  • 375 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 110 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • బ్యాంకింగ్, మెటల్ స్టాకుల అండతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు
Markets ends in profits

గత రెండు సెషన్లుగా నష్టాలను మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కోలుకున్నాయి. అసలు ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే, మధ్యాహ్నం తర్వాత బ్యాంకింగ్, మెటల్ స్టాకుల్లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 375 పాయింట్లు లాభపడి 48,081కి పెరిగింది. నిఫ్టీ 110 పాయింట్లు పుంజుకుని 14,406కి చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (3.60%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.67%), బజాజ్ ఆటో (2.30%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.12%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.99%).

టాప్ లూజర్స్:
టైటాన్ కంపెనీ (-2.75%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.81%), ఏసియన్ పెయింట్స్ (-1.80%), నెస్లే ఇండియా (-1.80%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.77%).