వివాహ బంధంతో ఒక్కటైన గుత్తా జ్వాల, విష్ణు విశాల్

22-04-2021 Thu 17:10
  • సినీ నటుడు విష్ణు విశాల్ ను పెళ్లాడిన గుత్తా జ్వాల
  • అతి తక్కువ మంది సమక్షంలో వివాహ వేడుక
  • హైదరాబాదులోని మొయినాబాదులో జరిగిన వివాహం
Vishnu Vishal tied knot with Badminton player Gutta jwala

ప్రముఖ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తన ప్రియుడు, సినీ నటుడు విష్ణు విశాల్ ను పెళ్లాడింది. ఈ మధ్యాహ్నం వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. హైదరాబాదులోని మొయినాబాదులో జరిగిన పెళ్లికి కొద్ది మంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఎక్కువ మందిని పెళ్లికి ఆహ్వానించలేదు.

మరోవైపు, వధూవరులకు సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొన్నేళ్లుగా జ్వాల, విష్ణు విశాల్ ప్రేమలో ఉన్నారు. గత ఏడాది సెప్టెంబరులో వీరి నిశ్చితార్థం జరిగింది. గుత్తా జ్వాలకు ఇది రెండో వివాహం అన్న సంగతి తెలిసిందే.