గ్రేటర్ వరంగల్ మునిసిపల్ ఎన్నికలు.. టీఆర్ఎస్ తొలి జాబితా విడుదల

21-04-2021 Wed 12:41
  • 66 డివిజన్లకు గాను 18 మంది పేర్లను విడుదల చేసిన టీఆర్‌ఎస్
  • బీఫారాలను అందించిన మంత్రి దయాకర్‌రావు
  • మే 30న ఎన్నికలు
TRS Released First List Of Warngal Corporation Candidates First list
వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 66 డివిజన్లకు ఎన్నికలు జరగనుండగా తొలి జాబితాలో 18 డివిజన్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. వీరికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బీ ఫారాలను అందించారు.  గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ పురపాలికలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 30న ఎన్నికలు జరగనుండగా, మే 3న ఫలితాలు రానున్నాయి.

టీఆర్ఎస్ విడుదల చేసిన తొలి  జాబితా ఇదే..

2వ డివిజ‌న్ – బానోతు క‌ల్ప‌న సింగూలాల్
5వ డివిజ‌న్ – తాడిశెట్టి విద్యాసాగ‌ర్
7వ డివిజ‌న్ – వేముల శ్రీనివాస్
13వ డివిజ‌న్ – సురేశ్ జోషి
15వ డివిజ‌న్ – ఆకుల‌ప‌ల్లి మ‌నోహ‌ర్
16వ డివిజ‌న్ – సుంక‌రి మ‌నీషా శివ‌కుమార్
17వ డివిజ‌న్ – గ‌ద్దె బాబు
23వ డివిజ‌న్ – యెలుగం లీలావ‌తి స‌త్య‌నారాయ‌ణ
27వ డివిజ‌న్ – జార‌తి ర‌మేశ్
29వ డివిజ‌న్ – గుండు సుధారాణి
38వ డివిజ‌న్ – బైర‌బోయిన ఉమా దామోద‌ర్
45వ డివిజ‌న్ – ఇండ్ల నాగేశ్వ‌ర్ రావు
51వ డివిజ‌న్ – బోయిన‌ప‌ల్లి రంజిత్ రావు
55వ డివిజ‌న్ – జ‌క్కుల ర‌జిత వెంక‌టేశ్వ‌ర్లు
56వ డివిజ‌న్ – సిరంగి సునీల్ కుమార్
57వ డివిజ‌న్ – న‌ల్ల స్వ‌రూప‌రాణి
64వ డివిజ‌న్ – ఆవాల రాధిక న‌రోత్తం రెడ్డి
65వ డివిజ‌న్ – గుగులోత్ దివ్యారాణి రాజు నాయ‌క్