భారీ రేటుకు 'అఖండ' హక్కులు!

20-04-2021 Tue 18:08
  • డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్న బాలయ్య
  • ప్రతినాయకుడి పాత్రలో ఆసక్తిని రేపనున్న శ్రీకాంత్
  • క్రేజీ కాంబినేషన్ కావడంతో భారీగా బిజినెస్  
Akhanda digital and satellite rights sold for biggest price
బోయపాటి దర్శకత్వంలో 'అఖండ' సినిమా రూపొందుతోంది. బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. ఇక మరో ముఖ్యమైన పాత్రలో 'పూర్ణ' కనిపించనుంది. పవర్ ఫుల్ విలన్ పాత్రను శ్రీకాంత్ పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. రిలీజ్ డేట్ ను కూడా ఎనౌన్స్ చేసిన కారణంగా, ఆ దిశగా చకచకా పనులను పూర్తిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ .. డిజిటల్ రైట్స్ కి సంబంధించిన టాక్ జోరుగా షికారు చేస్తోంది.

ఈ సినిమా శాటిలైట్ .. డిజిటల్ రైట్స్ ను 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్', 'స్టార్ మా' వారు దక్కించుకున్నట్టుగా సమాచారం. ఈ రెండు హక్కుల నిమిత్తం 13 నుంచి 15 కోట్ల వరకూ డీల్ కుదిరినట్టుగా చెబుతున్నారు. బాలకృష్ణ కెరియర్లో అత్యధిక రేటు పలికిన సినిమా ఇదేనని అంటున్నారు. బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్ కి గల క్రేజ్ కారణంగానే ఈ సినిమాకి ఈ స్థాయి రేటు పలికిందని చెబుతున్నారు. రైతుగా .. అఘోరగా డిఫరెంట్ లుక్స్ తో బాలకృష్ణ కనిపించనుండటం అందరిలో ఆసక్తిని పెంచుతోంది. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.