Delhi High Court: ఆక్సిజన్ కోసం వేచిచూడండి అని కరోనా రోగులకు చెబుతారా?: కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

  • ఢిల్లీలో కరోనా కరాళ నృత్యం
  • ఎటు చూసినా ఆందోళనకర పరిస్థితి
  • ఆక్సిజన్ దొరక్క కరోనా రోగుల విలవిల
  • పరిశ్రమలకు ఆక్సిజన్ నిలిపి, రోగులకు సరఫరా చేయాలన్న కోర్టు
  • పరిస్థితులను ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలని హితవు
Delhi High Court furious on Centre amidst lack of oxygen for corona patients

దేశంలో కరోనాతో కుదేలవుతున్న ప్రాంతాల్లో ఢిల్లీ అగ్రభాగాన ఉంటుంది. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో 32 వేల పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. బెడ్లు లేక, బెడ్లు దొరికినా ఆక్సిజన్ లభించక కరోనా రోగుల బాధలు వర్ణనాతీతం. ఈ నేపథ్యంలో, ఆక్సిజన్ కోసం వేచిచూడాలంటూ కరోనా రోగులకు చెబుతారా? అంటూ కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పెట్రోలియం, ఉక్కు వంటి పరిశ్రమలకు ఆక్సిజన్ సరఫరా నిలిపివేసి అయినా సరే, కరోనా రోగులకు తగినంత ఆక్సిజన్ అందించాలని పేర్కొంది.

"ప్రస్తుతం మనం సంక్షోభం దిశగా పయనిస్తున్నాం. ఇలాంటి సమయాల్లో మానవ జీవితాల కంటే ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యం అనే ధోరణి ప్రదర్శించడం సరికాదు" అని హితవు పలికింది. "కోటి మంది ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. త్వరగా స్పందించి వారిని కాపాడుకుందాం" అని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. తామున్నది ప్రభుత్వాలను నడిపించడానికి కాదని, ప్రభుత్వాలే పరిస్థితుల సున్నితత్వాన్ని అర్థంచేసుకుని ముందుకు నడవాలని ధర్మాసనం అభిప్రాయపడింది.

More Telugu News