Sensex: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • వరుసగా రెండో రోజు నష్టపోయిన మార్కెట్లు
  • 243 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 63 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
Markets ends in loses

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్సియల్ కంపెనీల షేర్లు ఒత్తిడికి గురికావడంతో నష్టాలు మూటకట్టుకున్నాయి. ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ చివరి వరకు మార్కెట్లు పతనమవుతూనే వచ్చాయి. చివర్లో కొంతమేర కొనుగోళ్లు చోటు చేసుకోవడంతో మార్కెట్లు నష్టాలను తగ్గించుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 243 పాయింట్లు కోల్పోయి 47,705కి పడిపోయింది. నిఫ్టీ 63 పాయింట్లు పతనమై 14,296కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (3.70%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (3.69%), బజాజ్ ఫైనాన్స్ (2.95%), బజాజ్ ఆటో (2.02%), మారుతి సుజుకి (1.95%).

టాప్ లూజర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (-4.70%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-3.56%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-3.16%), టెక్ మహీంద్ర (-1.67%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.50%).

More Telugu News