ICSE: కరోనా ఎఫెక్ట్​: ఐసీఎస్​ఈ బోర్డు పరీక్షలు రద్దు

  • ఇంటర్ పరీక్షలు వాయిదా
  • నిర్ణయం ప్రకటించిన కౌన్సిల్
  • టెన్త్ విద్యార్థులకు సహేతుకంగా మార్కులిస్తామని హామీ
ICSE Board Exam 2021 cancelled ISC Exam 2021 postponed due to Covid 19 surge

కరోనా కేసుల తీవ్రత ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో ఐసీఎస్ఈ (ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) పదో తరగతి బోర్డు పరీక్షలు రద్దయ్యాయి. ఐఎస్సీ (ఇంటర్) పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షల రద్దు, వాయిదాకు సంబంధించి ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ మండలి (సీఐఎస్ సీఈ) మంగళవారం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.  

వాస్తవానికి అంతకుముందు ఐసీఎస్ఈ, ఐఎస్ సీ పరీక్షలను వాయిదా వేయాలని భావించినా.. ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడంతో పదో తరగతి పరీక్షలను రద్దు చేసి, ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

సవరించిన తేదీల ప్రకారం జూన్ లో ఐఎస్ సీ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపింది. టెన్త్ విద్యార్థులకు సహేతుక పద్ధతుల్లో నిష్పక్షపాతంగా మార్కులు ఇస్తామని హామీ ఇచ్చింది. పదకొండో తరగతి (ఇంటర్ ఫస్టియర్) క్లాసులు త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. 

More Telugu News