Nikhil: నిఖిల్ కెరియర్లోనే డిఫరెంట్ కాన్సెప్ట్ .. '18 పేజెస్'

Nikhil is seen as in different role in 18 Pages movie
  • నిఖిల్ - అనుపమ కాంబినేషన్లో '18 పేజెస్'
  • విభిన్నమైన కథాకథనాలు
  • ముగింపుదశలో షూటింగ్

ఈ తరం యంగ్ హీరోల్లో నిఖిల్ చాలా యాక్టివ్ గా కనిపిస్తాడు. యువ దర్శకులతో చాలా సన్నిహితంగా ఉంటూ .. వాళ్లతో పాటు ట్రావెల్ అవుతూ సినిమాలు చేస్తూ ఉండటం నిఖిల్ ప్రత్యేకత. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను .. తన మార్కెట్ కి తగిన బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుని కథలను సెట్ చేసుకోవడం నిఖిల్ తెలివితేటలకు నిదర్శనం. క్రితం ఏడాది 'అర్జున్ సురవరం' సినిమాతో హిట్ అందుకున్న ఆయన, ఈ ఏడాది రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు.

ఆ సినిమాల్లో ఒకటి 'కార్తికేయ 2' అయితే, మరొకటి '18 పేజెస్'. గీతా ఆర్ట్స్ 2 .. సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా '18 పేజెస్' సినిమాను నిర్మిస్తున్నాయి. 'కుమారి 21 F' సినిమాతో యూత్ లో అలజడి సృష్టించిన సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్, ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

 ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ గెస్టు హౌస్ లో ఈ సినిమా షూటింగు జరుగుతోంది. నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్ తో .. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉంటుందని నిఖిల్ చెప్పడం, ఈ సినిమాపై మరింత ఉత్కంఠను పెంచుతోంది.
Nikhil
Anupama Parameshwaaran
Palnati Surya Prathap

More Telugu News