KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్

Telangana CM KCR tested corona positive
  • స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న సీఎం కేసీఆర్
  • వైద్య పరీక్షల్లో కరోనా నిర్ధారణ
  • సీఎం ఆరోగ్య పరిస్థితిని వెల్లడించిన సీఎస్ సోమేశ్ కుమార్
  • హోం ఐసోలేషన్ లో కేసీఆర్
  • పర్యవేక్షిస్తున్న వైద్య నిపుణుల బృందం
కరోనా మహమ్మారి బాధితుల జాబితాలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చేరారు. సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ముఖ్యమంత్రికి కరోనా సోకిందని సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. ఆయన స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని తెలిపారు. కాగా, హోం ఐసోలేషన్ లో ఉండాలని కేసీఆర్ కు వైద్యులు సూచించారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో ఉన్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణుల బృందం ఎప్పటికిప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తోందని సీఎస్ సోమేశ్ కుమార్ వివరించారు. రెండు వారాల కిందట సీఎస్ సోమేశ్ కుమార్ కు కరోనా పాజిటివ్ వచ్చింది.
KCR
Corona Virus
Positive
CS Somesh Kumar

More Telugu News