మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కరోనా... ఎయిమ్స్ లో చికిత్స

19-04-2021 Mon 18:43
  • మన్మోహన్ కు కరోనా పరీక్ష
  • నేడు పాజిటివ్ గా తేలిన వైనం
  • ఎయిమ్స్ కు తరలించిన కుటుంబ సభ్యులు
  • కరోనా కట్టడిపై నిన్న మోదీకి లేఖ రాసిన మన్మోహన్
Former prime minister Manmohan Singh tested corona positive

భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కరోనా బారిన పడ్డారు. కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ రావడంతో చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. ఇటీవలే కొవిడ్ నియంత్రణ ఇలా చేయవచ్చంటూ కేంద్రానికి మన్మోహన్ పలు సూచనలు చేశారు. ఆ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు.

దేశంలో మహోగ్రరీతిలో విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్ ను 5 సూత్రాలతో కట్టడి చేయవచ్చని వివరించారు. ప్రజలకు విస్తృత స్థాయిలో వ్యాక్సిన్ ఇవ్వడంపై దృష్టి సారించాలని ప్రధానంగా పిలుపునిచ్చారు. దురదృష్టవశాత్తు మన్మోహన్ ఇవాళ కరోనా బాధితుల జాబితాలో చేరారు.