సీరమ్, భారత్ బయోటెక్ సంస్థలకు భారీగా రుణాలు మంజూరు చేసిన కేంద్రం
- దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సీరమ్, భారత్ బయోటెక్
- ఉత్పత్తి మరింత పెంచాలన్న కేంద్రం
- సీరమ్ సంస్థకు రూ.3 వేల కోట్ల రుణం
- భారత్ బయోటెక్ కు రూ.1,500 కోట్లు
ఈ క్రమంలో ఆ రెండు సంస్థలకు భారీగా రుణాలు మంజూరు చేసింది. సీరమ్ సంస్థకు రూ.3 వేల కోట్లు, భారత్ బయోటెక్ సంస్థకు రూ.1,500 కోట్లు రుణం అందించింది. హైదరాబాదుకు చెందిన భారత్ బయోటెక్ కొవాగ్జిన్ పేరిట వ్యాక్సిన్ అభివృద్ధి చేయగా, ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ టీకా కొవిషీల్డ్ ను సీరమ్ భారత్ లో ఉత్పత్తి చేస్తోంది. భారత్ లో తయారైన వ్యాక్సిన్లను దేశీయంగా వినియోగించడమే కాకుండా, కేంద్రం ఇతర దేశాలకు కూడా అందిస్తోంది.