మాస్కు ఎందుకు పెట్టుకోలేద‌ని అడిగినందుకు పోలీసుల‌ను తిడుతూ యువ‌తి హ‌ల్‌చ‌ల్‌.. వీడియో ఇదిగో

19-04-2021 Mon 15:26
  • ఢిల్లీలో కారులో వెళ్తున్న దంప‌తులు
  • కారును ఆపిన పోలీసులు
  • భ‌ర్త‌కు ముద్దుపెట్టినా ఆపుతారా? అన్న యువ‌తి
couple misbehaved with Delhi Police

మాస్కు ఎందుకు పెట్టుకోలేద‌ని పోలీసులు అడిగినందుకు త‌న భ‌ర్త‌తో క‌లిసి పోలీసుల‌ను చెడామడా తిట్టింది ఓ యువ‌తి. అక్క‌డున్న జ‌నాలంతా త‌మ‌ వైపుకే చూస్తుండ‌డంతో వారిని కూడా గదిమింది. ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌నకు సంబంధించిన దృశ్యాలను పోలీసులు త‌మ స్మార్ట్ ఫోన్‌లో చిత్రీకరించారు.  

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..  ఓ కారులో భార్యాభ‌ర్తలు ధరియా‌గంజ్ నుంచి వెళ్తున్న స‌మ‌యంలో వారు  కరోనా నిబంధనలు పాటించడం లేద‌ని పోలీసులు కారును ఆపారు. మాస్కులు ఎందుకు ధరించలేదని వారిని పోలీసులు ప్రశ్నించారు. దీంతో ఆ దంప‌తుల‌కు కోపం వ‌చ్చేసింది.

త‌న భ‌ర్త కంటే ముందే కారులోంచి దిగిన సదరు యువ‌తి పోలీసుల‌తో గొడ‌వ ప‌డింది. త‌న‌ భర్తకు ముద్దు కూడా ఇస్తాన‌ని, త‌మ‌ను అడ్డుకుంటారా? అని ప్రశ్నించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు భార్యాభ‌ర్త‌లిద్ద‌రినీ అరెస్టు చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు. భార్యాభ‌ర్త‌ల పేర్ల‌ను పంక‌జ్, అభగా పోలీసులు గుర్తించారు. వారిద్ద‌రు చివ‌ర‌కు మాస్కులు పెట్టుకుని విచార‌ణ‌కు వ‌చ్చారు.