Nagababu: అల్లుడికి సర్ ప్రైజ్ గా రూ. 70 లక్షల బహుమతి ఇచ్చిన నాగబాబు!

Nagababu Costly gift to Son in Law
  • గత డిసెంబర్ లో నీహారిక వివాహం
  • ఉగాదికి కానుక ఇవ్వాలని భావించిన నాగబాబు
  • కాస్త అలస్యమైనా రేంజ్ రోవర్ బహుమతి
మెగా సోదరుడు నాగబాబు కుమార్తె నీహారిక వివాహం జొన్నలగడ్డ చైతన్యతో గత సంవత్సరం డిసెంబర్ లో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత నీహారిక తన సంసారంపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో వివరాలను అభిమానులతో పంచుకుంటూనే ఉందన్న సంగతి తెలిసిందే. తాజాగా తన అల్లుడికి నాగబాబు ఓ ఖరీదైన బహుమతిని ఇచ్చారు. వాస్తవానికి ఈ బహుమతి ఉగాది సందర్భంగా ఇవ్వాల్సి వుందని, కానీ కాస్తంత ఆలస్యం అయిందని చెప్పుకొచ్చారు.

ఇంతకీ ఈ బహుమతి ఏంటని అనుకుంటున్నారా? వైట్ కలర్ రేంజ్ రోవర్ కారు. దీని ఖరీదు రూ. 70 లక్షల వరకూ ఉంటుంది. ఇందుకు సంబంధించిన చిత్రాన్ని, వీడియోను నాగబాబు తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఈ చిత్రం ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.

Nagababu
Niharika
Chaitanya
Gift
Ugadi

More Telugu News