'రాధేశ్యామ్'లో లవ్ ట్రాక్ అలా మొదలవుతుందట!

17-04-2021 Sat 10:14
  • తొలిసారిగా రొమాంటిక్ హీరోగా ప్రభాస్
  • అద్భుత దృశ్యకావ్యంగా తీర్చిదిద్దే ప్రయత్నం
  • మెడికల్ స్టూడెంట్ గా పూజ హెగ్డే
Praabhas Pooja introduction scene from Radhe Shyam

ప్రభాస్ కథానాయకుడిగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' రూపొందుతోంది. ఇది రొమాంటిక్ ఎంటరైనర్ .. ఈ తరహా కథలో .. పాత్రలో ప్రభాస్ కనిపించనుండటం ఇదే మొదటిసారి. ఈ సినిమాను గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఒక ఖరీదైన ప్రేమకథ. అందువలన ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా దీనిని మలిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతవరకూ మాస్ హీరోగా రౌడీలను ఎడా పెడా చితగ్గొట్టేసిన ప్రభాస్, ఈ సినిమాలో హీరోయిన్ తో రొమాన్స్ కే పూర్తి సమయాన్ని కేటాయించాడని అనుకోవాలి.

సాధారణంగా ఏ సినిమాలోనైనా హీరో హీరోయిన్లు కలుసుకునే సీన్ పై ఆడియన్స్ ఎక్కువ ఆసక్తిని చూపుతుంటారు. అలాంటిది ఇది ప్రేమకథనాయే .. అందువలన ప్రభాస్ .. పూజ ఎక్కడ ఎలా కలుస్తారు? అనేది సహజంగానే అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతుంది. ఈ సినిమాలో పూజ హెగ్డే మెడికల్ స్టూడెంట్ గా కనిపిస్తుందని అంటున్నారు.

ఆమె ఒక హాస్పిటల్లో పనిచేస్తూ ఉండగా, ప్రమాదానికి గురైన హీరో అక్కడికి వస్తాడు. ఆయన కోలుకోవడంలో ఆమె ప్రధానమైన పాత్ర పోషిస్తుందట. అక్కడి నుంచే .. అప్పటి నుంచే వాళ్ల మధ్య ప్రేమ ప్రయాణం మొదలవుతుందని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతోగానీ .. వినడానికైతే బాగుందికదూ!