Kumbh Mela: కుంభమేళా ముగిసినట్టు ప్రకటించిన ‘నిరంజని అఖాడా’.. సాధువుల ఆగ్రహం

  • నిర్వాణీ అఖాడాపై మిగతా అఖాడాల సాధువుల ఆగ్రహం
  • క్షమాపణలు చెప్పాలని డిమాండ్
  • ఈ నెల 27న షాహీ స్నాన్ కొనసాగుతుందని స్పష్టీకరణ
Niranjani Akhada announces end of Maha Kumbh

కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో కుంభమేళాను ముగిస్తున్నట్టు ‘నిరంజని అఖాడా’ ప్రకటించడం వివాదాస్పదమైంది. కుంభమేళాను ముగిస్తున్నట్టు ప్రకటించే అధికారం నిరంజని అఖాడాకు ఎక్కడిదని మిగతా అఖాడాలకు చెందిన సాధువులు మండిపడుతున్నారు.

మేళాను ముగిస్తున్నట్టు ప్రకటించినందుకు అఖాడా పరిషత్‌కు క్షమాపణలు చెప్పాలని నిర్వాణి అనీ అఖాడా అధ్యక్షుడు మహంత్ ధర్మ్‌దాస్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, లేదంటే మేళా అధికారికి మాత్రమే కుంభమేళా ముగిసినట్టు ప్రకటించే అధికారం ఉందన్నారు.

ఈ నెల 27న కరోనా నిబంధనలకు అనుగుణంగానే షాహీ స్నాన్ నిర్వహిస్తామన్నారు. నిజానికి కుంభమేళా మూడు నెలలపాటు జరుగుతుంది. అయితే, ఈసారి మాత్రం కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి 30 వరకు నెల రోజులపాటు మాత్రమే నిర్వహించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా ఉద్ధృతి కొనసాగుతుండడం, వందలాదిమంది భక్తులు వైరస్ బారినపడుతుండడంతో కుంభమేళాను ఇప్పుడే ముగిస్తున్నట్టు నిరంజని అఖాడా నిన్న ప్రకటించింది.

More Telugu News