సెకండ్ వేవ్ బలంగా ఉంది.. తేలికగా తీసుకోవద్దు: జేసీ ప్రభాకర్ రెడ్డి

15-04-2021 Thu 13:52
  • ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ బలంగా ఉంది
  • అందరూ మాస్క్, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలి
  • తాడిపత్రిలో త్వరలోనే మాస్కులు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేస్తాం
Corona second wave is very strong says JC Prabhakar Reddy

కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉందని టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ చాలా బలంగా ఉందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని సూచించారు.

దుకాణదారులు, చిరు వ్యాపారస్తులు మాస్కులు కచ్చితంగా ధరించాలని... లేకపోతే కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. తేరు బజార్ లో కరోనా బారిన వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, ఈ ప్రాంతంలోని వారు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తాడిపత్రి ప్రజలకు త్వరలోనే మాస్కులు, బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేస్తామని తెలిపారు. ఈరోజు తాడిపత్రిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.