వీడియోలు తీసుకుని విచార‌ణ‌కు రమ్మంటూ దేవినేని ఉమ‌కు నోటీసులు

15-04-2021 Thu 13:28
  • మార్ఫింగ్‌ చేసిన జగన్‌ వీడియోలు ప్రదర్శించారని ఫిర్యాదు
  • సీఐడీ కేసు న‌మోదు
  • జ‌గ‌న్ మాట‌ల‌ను వ‌క్రీక‌రించాల‌ని ఆరోప‌ణ‌లు
devineni gets cid notice

ఇటీవ‌ల టీడీపీ నేత‌ దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు మీడియా సమావేశం నిర్వహించి మార్ఫింగ్‌ చేసిన జగన్‌ వీడియోలు ప్రదర్శించారని వైసీపీ ఆరోపణ‌లు చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సీఎం జగన్‌ మాటలను ఆయ‌న‌ వక్రీకరించారని ఓ న్యాయవాది చేసిన‌ ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదైంది. కర్నూలు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ గొల్లపూడిలోని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు నివాసంలో అధికారులు నోటీసులు అందజేశారు. మీడియా సమావేశంలో దేవినేని ఉమ‌ ప్రదర్శించిన వీడియోలను కూడా తీసుకురావాలని ఆదేశించారు.