Virat Kohli: అసహనంతో కుర్చీని తన్నిన కోహ్లీ... మందలించిన రిఫరీ!

Refary Warning to Kolhi
  • నిన్న సన్ రైజర్స్ తో మ్యాచ్
  • అవుట్ అయిన తరువాత కోహ్లీ అసహనం
  • కుషన్ ను, కుర్చీని తన్నిన కోహ్లీ
నిన్న రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ తో చెన్నైలో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, రిఫరీ మందలింపునకు గురయ్యాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ, 149 పరుగులకు పరిమితమైంది. తన జట్టు స్కోరు వేగం పెంచాలన్న ఉద్దేశంతో 12వ ఓవర్ ఒకటో బంతికి భారీ షాట్ ను ఆడిన కోహ్లీ, లాంగ్ లెగ్ లో ఉన్న విజయ్ శంకర్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

ఆపై కోహ్లీ అడ్వర్టయిజ్ మెంట్ కుషన్ ను, అక్కడే ఉన్న కుర్చీని కాలితో తన్నుతూ తన అసహనాన్ని ప్రదర్శించాడు. ఈ ఘటనపై లెవల్ 1 అభియోగాలను నమోదు చేసిన రిఫరీ వెంగలిల్ నారాయణ్ కుట్టి, కోహ్లీని మందలింపుతో సరిపెట్టాడు. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Virat Kohli
Refary
RCB
SRH

More Telugu News