బాలా మావయ్య టెర్రిఫిక్: 'అఖండ' టీజర్ పై లోకేశ్ స్పందన

13-04-2021 Tue 16:59
  • బాలయ్య, బోయపాటి చిత్రానికి 'అఖండ' టైటిల్ ఖరారు
  • ఉగాది కానుకగా టీజర్ విడుదల
  • ఎంతో థ్రిల్లయ్యానన్న లోకేశ్
  • బాలా మావయ్య ఉగ్రరూపం ప్రదర్శించాడని కితాబు
  • సినిమా బ్లాక్ బస్టర్ ఖాయం అంటూ ట్వీట్
Nara Lokesh terms Balakrishna performance in Akhanda terrific

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న మూడో చిత్రానికి 'అఖండ' అనే టైటిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందం బాలయ్య కొత్త లుక్ తో కూడిన టీజర్ ను రిలీజ్ చేసింది. ఈ టీజర్ పై టీడీపీ అగ్రనేత, బాలకృష్ణ అల్లుడు నారా లోకేశ్ స్పందించారు. 'అఖండ' టీజర్ చూశాక ఎంతో థ్రిల్లయ్యానని, బాలా మావయ్య ఉగ్రరూపం చూపించాడని లోకేశ్ పేర్కొన్నారు. ఈ సినిమా కచ్చితంగా తిరుగులేని బ్లాక్ బస్టర్ అవుతుందని అభిప్రాయపడ్డారు.

బోయపాటి దర్శకత్వంలో బాలయ్య గతంలో 'సింహా', 'లెజెండ్' చిత్రాల్లో నటించగా రెండూ పెద్ద హిట్లయ్యాయి. ఇప్పుడీ మూడో చిత్రంలో నందమూరి హీరో అఘోరాగా కనిపిస్తాడని తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ లో త్రిశూలంతో బాలకృష్ణ రౌద్రరసం పండించాడు. ఉగాది కానుకగా వెలువడిన 'అఖండ' టీజర్ నందమూరి అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.