త‌మ పెళ్లి తేదీని ప్ర‌క‌టించిన గుత్తా జ్వాల, విష్ణు విశాల్‌

13-04-2021 Tue 13:32
  • కొన్నాళ్లుగా ప్రేమ‌లో ఉన్న జంట‌
  • లాక్‌డౌన్‌లో నిశ్చితార్థం
  • ఈ నెల 22నే వివాహం  
Gutta Jwala getting married on 22nd April

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ ప్రేమ‌లో ఉన్న విష‌యం తెలిసిందే. క‌రోనా లాక్ డౌన్ సమయంలో ఈ జోడీ నిశ్చితార్థం జ‌రిగింది. త్వరలోనే పెళ్లి తేదీ ప్రకటిస్తామని ఇటీవ‌లే విష్ణు విశాల్ చెప్పాడు. చెప్పిన‌ట్లే గుత్తా జ్వాల,  విష్ణు విశాల్ త‌మ పెళ్లి తేదీని ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు.

త‌మ కుటుంబ స‌భ్యుల ఆశీర్వాదాల‌తో తాము పెళ్లి చేసుకోబోతున్నామ‌ని, ఈ విష‌యాన్ని అంబ‌రాన్నంటే సంతోషంతో ప్ర‌క‌టిస్తున్నామ‌ని చెప్పారు. త‌మ కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో ఈ నెల 22న త‌మ‌ పెళ్లి జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఇన్నేళ్లుగా త‌మ‌పై ప్రేమాభిమానాలు కురిపిస్తోన్న అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్న‌ట్లు ఇరువురూ సంయుక్తంగా ప్ర‌క‌ట‌న చేశారు.