'క‌పాలం ప‌గిలిపోద్దీ..' అంటోన్న బాల‌కృష్ణ‌.. బోయపాటి కొత్త సినిమా టైటిల్, టీజర్ విడుద‌ల‌

13-04-2021 Tue 13:15
  • బాలకృష్ణ, బోయపాటి కాంబో సినిమా
  • చిత్రానికి 'అఖండ' అనే టైటిల్ ఖ‌రారు
  • శివ భక్తుడిగా కనిపించనున్న బాలయ్య‌
Akhanda Title Roar Nandamuri Balakrishna

హీరో నంద‌మూరి బాలకృష్ణ, ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వ‌స్తోన్న కొత్త సినిమా టైటిల్ ను ఉగాది సంద‌ర్భంగా ప్ర‌క‌టిస్తామ‌ని ఆ చిత్ర యూనిట్ చెప్పిన విష‌యం తెలిసిందే. చెప్పిన‌ట్లే ఈ రోజు ఆ సినిమా టైటిల్ తో పాటు టీజ‌ర్‌ను వ‌దిలింది ఆ సినిమా యూనిట్. ఈ సినిమాకు 'అఖండ'‌ పేరును ఖ‌రారు చేసింది.

మెడ‌లో ర‌ద్రాక్ష‌లు, చేతిలో త్రిశూలం, నుదిటిపై విభూదితో బాల‌కృష్ణ శివ భ‌క్తుడిగా ఇందులో క‌న‌ప‌డుతున్నారు. 'హ‌ర‌హ‌ర మ‌హాదేవ.. శంభో శంక‌ర‌.. క‌పాలం ప‌గిలిపోద్దీ' అంటూ ఆయ‌న చెబుతోన్న డైలాగులు అల‌రిస్తున్నాయి. త్రిశూలంతోనే ఆయ‌న ఫైటింగులు చేస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకు మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బాలయ్య సరసన ప్రగ్యా జైశ్వాల్ న‌టిస్తోంది. టీజ‌ర్‌లో తమన్ సంగీతం శాంపిల్ అదుర్స్ అనిపిస్తోంది.