చంద్రబాబు సభపై రాళ్ల దాడి నేపథ్యంలో గవర్నర్ అపాయింట్ మెంట్ కోరిన టీడీపీ నేతలు

12-04-2021 Mon 21:39
  • తిరుపతిలో చంద్రబాబు రోడ్ షో
  • రాళ్లు విసిరిన దుండగులు
  • చంద్రబాబు ప్రచార వాహనంపైనా రాళ్లదాడికి యత్నం
  • ఘటనలను గవర్నర్ కు వివరించాలని టీడీపీ నేతల యత్నం
TDP leaders tries to meet Governor

తిరుపతిలో ఎన్నికల బరిలో చంద్రబాబు ప్రచార వాహనంపై రాళ్ల దాడి జరగడాన్ని టీడీపీ నేతలు ఖండించారు. ఈ ఘటనలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు వివరించాలని వారు నిర్ణయించుకున్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నేతృత్వంలో టీడీపీ నేతల బృందం గవర్నర్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరింది.

జడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ చంద్రబాబుపై తిరుపతిలో రాళ్లదాడికి యత్నించడం పట్ల టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలతో పాటు చంద్రబాబు భద్రతపైనా తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు గవర్నర్ ను కోరనున్నారు. రాళ్లదాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని కోరనున్నారు.