Punjab Kings: విరుచుకుపడిన దీపక్ హుడా, కేఎల్ రాహుల్... పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు

Punjab Kings posts huge total against Rajastan Royals
  • ముంబయిలో రాజస్థాన్ వర్సెస్ పంజాబ్
  • మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 221 రన్స్
  • కేఎల్ రాహుల్ 50 బంతుల్లో 91 రన్స్
  • 28 బంతుల్లో 64 రన్స్ చేసిన దీపక్ హుడా
ముంబయి వాంఖెడే స్టేడియంలో మరోసారి పరుగులు వెల్లువెత్తాయి. రాజస్థాన్ రాయల్స్ తో ఐపీఎల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు ఆకాశమే హద్దు అన్నట్టుగా చెలరేగిపోయారు. టాస్ ఓడిన పంజాబ్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 6 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి విధ్వంస ఇన్నింగ్స్ తో ఆకట్టుకోగా, మిడిలార్డర్ లో వచ్చిన దీపక్ హుడా మెరుపుదాడి చేశాడు.

ఓపెనర్ గా బరిలో దిగిన రాహుల్ 50 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సులతో 91 పరుగులు సాధించాడు. దీపక్ హుడా కేవలం 28 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 భారీ సిక్సులతో 64 పరుగులు నమోదు చేశాడు. వన్ డౌన్ లో వచ్చిన క్రిస్ గేల్ 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 40 పరుగులు సాధించాడు. రాజస్థాన్ బౌలర్లలో చేతన్ సకారియా 3, క్రిస్ మోరిస్ 2 వికెట్లు తీశారు. రియాన్ పరాగ్ కు ఓ వికెట్ దక్కింది. పంజాబ్ బ్యాట్స్ మెన్ విజృంభణకు అడ్డుకట్ట వేసేందుకు ఈ మ్యాచ్ లో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ఏకంగా 8 మందితో బౌలింగ్ చేయించాడు.
Punjab Kings
Rajastan Royals
IPL
Wankhede Stadium
Mumbai

More Telugu News