ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు... అడ్డుకున్న పోలీసులు

12-04-2021 Mon 21:01
  • తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో ఉద్రిక్తతలు
  • చంద్రబాబు రోడ్ షోపై రాళ్ల దాడి
  • రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు
  • ఆపై ఎస్పీని కలిసే ప్రయత్నం
Chandrababu tries to enter SP Office in Tirupati

తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీ ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు రోడ్ షోలో రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనను చంద్రబాబు తీవ్రంగా పరిగణిస్తున్నారు. రాళ్ల దాడి జరగడంపై నిరసనగా తిరుపతిలో రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు... ప్రస్తుతం ర్యాలీగా బయల్దేరి ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే, ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో చంద్రబాబు ఎస్పీ కార్యాలయం ముందు రోడ్డుపై నిలబడ్డారు. జరుగుతున్న పరిణామాల పట్ల టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో ప్రస్తుతం అడిషనల్ ఎస్పీ సుప్రజ బయటికి వచ్చి చంద్రబాబుతో మాట్లాడుతున్నారు.