ప్లవ నామ సంవత్సరంలో ఇంటింటా సిరులు నిండాలి: సీఎం జగన్ ఉగాది శుభాకాంక్షలు

12-04-2021 Mon 18:54
  • రేపు ఉగాది.. ప్లవ నామ సంవత్సరాది
  • ఇంటింటా ఆనందాలు వెల్లివిరియాలన్న సీఎం
  • ఈ ఏడాది కూడా బాగా వర్షాలు కురవాలని ఆకాంక్ష
CM Jagan wishes all Telugu people across the world happy Ugadi

రేపు తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా సీఎం జగన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఉగాది శుభాకాంక్షలు అంటూ ఓ ప్రకటన చేశారు. ప్లవ నామ సంవత్సరంలో ఇంటింటా సిరులు, ఆనందాలు నిండాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది కూడా సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు (రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా) సుభిక్షంగా ఉండాలని అభిలషించారు.