ఎంబీఏ చదువుతున్నప్పటి ఫొటో పంచుకున్న హీరో సిద్ధార్థ్

12-04-2021 Mon 18:43
  • 2001లో ఎంబీయే చదివిన సిద్ధార్థ్
  • ముంబయిలోని ఎస్పీజేఐఎంఆర్ కాలేజీలో విద్యాభ్యాసం
  • స్నేహితురాలు మీనాల్ తో కలిసి ఫొటో
  • అప్పుడే 20 ఏళ్లు గడచిపోయాయా అంటూ ఆశ్చర్యం
Hero Siddarth shares a photo

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతుడైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్ ఆసక్తికరమైన ఫొటో పంచుకున్నాడు. 2001లో తాను ముంబయిలో ఎంబీఏ చదువుతున్నప్పటి ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు.

"ముంబయిలోని ఎస్పీజేఐఎంఆర్ కాలేజీ క్యాంపస్ లో నా ప్రియమైన స్నేహితురాలు మీనాల్ తో ఫొటో ఇది. కాలం ఎలా గడిచిపోతోందో? అప్పుడే 20 ఏళ్లయ్యాయా?" అని సిద్ధార్థ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆ ఫొటోలో తాను టోపీ పెట్టుకుని ఉన్నానని, అప్పట్లో తనను స్నేహితులు సిడీ అని పిలిచేవారని వెల్లడించాడు. 'అప్పటి నా నిక్ నేమ్ ఇప్పుడు మీక్కూడా తెలిసిపోయింది' అని వివరించాడు.