Madhya Pradesh: కరోనా పేషెంట్ కుటుంబాన్ని చితకబాదిన పోలీసులు.. వీడియో వైరల్!

Cops thrash Corona patients family video goes viral
  • మధ్యప్రదేశ్ లోని ఖండ్వాలో దారుణ ఘటన
  • వృద్ధుడితో పాటు ఇద్దరు మహిళలపై లాఠీలతో దాడి
  • పోలీసులపై విచారణ జరిపిస్తామన్న జిల్లా ఎస్పీ
కరోనా పేషెంట్ కుటుంబసభ్యులను పోలీసులు చితకబాదిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వృద్ధుడిని ఇద్దరు పోలీసులు పట్టుకోగా... మరో పోలీసు లాఠీతో అతనిని బాదుతున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి.

అంతేకాదు, ఇద్దరు మహిళలను కూడా దారుణంగా కొడుతున్న సన్నివేశాలు ఉన్నాయి. వృద్ధుడిని కొడుతున్న పోలీసులును అడ్డుకునేందుకు సదరు మహిళలు వెళ్లడంతో... వారిపై కూడా పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఖండ్వాలో చోటు చేసుకుంది.

అయితే, ఈ ఘటనకు సంబంధించి మరో వాదన కూడా వినిపిస్తోంది. కరోనా బారిన పడిన పేషెంట్ కుటుంబసభ్యులు వైద్య సిబ్బందిపై దాడి చేశారని... వైద్య సిబ్బందిని రక్షించేందుకే పోలీసులు అక్కడకు వెళ్లారని అంటున్నారు. మరోవైపు కరోనా పేషెంట్ కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ వివేక్ సింగ్ స్పందిస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై విచారణ జరిపిస్తామని తెలిపారు.  
Madhya Pradesh
Corona Patient
Family Members
Police
Attack

More Telugu News