యాక్సిస్ బ్యాంకు నుంచి రూ. 4.04 కోట్లతో పరారైన సెక్యూరిటీ గార్డు
- చండీగఢ్‌లోని సెక్టార్ 34ఎలో ఘటన
- ఏటీఎంకు తరలించేందుకు డబ్బు సిద్ధం చేసిన బ్యాంకు
- ఓ పెట్టె తీసుకుని పరారైన సెక్యూరిటీ గార్డు
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఏటీఎంలలో నగదు పెట్టేందుకు అధికారులు పెట్టెల్లో డబ్బులు సిద్ధం చేశారు. గమనించిన సెక్యూరిటీ గార్డు సుమీత్ అందులో ఓ పెట్టె తీసుకుని పరారైనట్టు పోలీసులు తెలిపారు. అతడు పెట్టెతో పరారవుతున్న దృశ్యాలు బ్యాంకులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. నిందితుడు మొహాలీలోని సోహానాకు చెందిన వాడని పోలీసులు తెలిపారు.