అందుకే మీ తిరుప‌తి స‌భ‌ను వాయిదా వేశారా?: జ‌గ‌న్‌కు వ‌ర్ల రామ‌య్య ప్ర‌శ్న‌

11-04-2021 Sun 11:50
  • కరోనా భయంతోనేనా?
  • అదే నిజమైతే ఎన్నికలు వాయిదా వెయ్యాలిగా?
  • అసలు మీ భయం కరోనా గురించా?
  • లేక "బాబాయిని చంపిందెవరని" జనం నిలదీస్తారనా?  
varla slams jagan

తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక నేప‌థ్యంలో వైసీపీ త‌ర‌ఫున‌ ఏపీ సీఎం జగన్ ఈ నెల 14న  భారీ బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉండగా, కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో దాన్ని రద్దు చేసుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య విమ‌ర్శ‌లు గుప్పించారు.

'మీ తిరుపతి ఎన్నిక‌ల‌ సభ ఎందుకు వాయిదా వేశారు ముఖ్యమంత్రి గారూ, కరోనా భయంతోనేనా? మరి మిగతా నాయకుల సభలకు జనం తండోప తండాలుగా వస్తున్నారు. అదే నిజమైతే, ఎన్నికలు వాయిదా వెయ్యాలిగా? అసలు మీ భయం, కరోనా గురించా, లేక "బాబాయిని చంపిందెవరని" జనం నిలదీస్తారనా? తెగేదాక‌ లాక్కండి సార్, పబ్లిక్ సార్' అని వ‌ర్ల రామ‌య్య విమ‌ర్శ‌లు గుప్పించారు.