పవన్ కల్యాణ్ అద్భుతం: మహేశ్ బాబు పొగడ్తల వర్షం!

11-04-2021 Sun 06:23
  • గతవారం విడుదలైన వకీల్ సాబ్
  • పవన్ నటన చాలా పవర్ ఫుల్
  • తన ప్రతిభను మరోసారి చూపిన ప్రకాశ్ రాజ్
Mahesh Babu Praises Vakeel Saab

గతవారం విడుదలై, సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'పై టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు పొగడ్తల వర్షం కురిపించారు. ఈ సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసించిన ఆయన, లాయర్ గా పవన్ చాలా బాగా నటించారని, ఆయన నటన చాలా పవర్ ఫుల్ గా ఉందని అన్నారు. ప్రకాశ్ రాజ్ తనలోని ప్రతిభను మరోసారి తెరపైకి తెచ్చారని, నివేద, అంజలి, అనన్యలు మనసులను హత్తుకునేలా సినిమాలో లీనమయ్యారని అన్నారు.

తమన్ తన సంగీతంతో చిత్రాన్ని ఇంకో మెట్టు ఎక్కించారని కితాబిచ్చారు. కాగా, వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించగా, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలైన తరువాత, సోషల్ మీడియా వేదికగా, పలువురు ప్రముఖులు సినిమా యూనిట్ ను ప్రశంసిస్తూ, అభినందనలు తెలిపారు.