బాలీవుడ్ నటుడ్ని బలిగొన్న కరోనా మహమ్మారి

10-04-2021 Sat 22:13
  • లుథియానాలో కన్నుమూసిన సతీశ్ కౌల్
  • 300కి పైగా చిత్రాల్లో నటించిన కౌల్
  • టీవీ మహాభారతం ద్వారా గుర్తింపు
  • ఇంద్రుడి పాత్ర పోషించిన కౌల్
Bollywood actor Satish Kaul died of corona

గతేడాది అనేకమంది ప్రముఖులను బలిగొన్న కరోనా వైరస్ రక్కసి తాజాగా బాలీవుడ్ నటుడు సతీశ్ కౌల్ ప్రాణాలు తీసింది. ఇటీవల కరోనా బారినపడిన ఆయన పంజాబ్ లోని లుథియానాలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గతేడాది కరోనా కారణంగా సినిమా రంగం స్తంభించిపోవడంతో ఆయన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాంతో బాలీవుడ్ నుంచి ఆర్థికసాయం కోరారు. ఈ నేపథ్యంలో పంజాబ్ సీఎ కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పందించి రూ.5 లక్షల సాయం అందజేశారు.

66 ఏళ్ల సతీశ్ కౌల్ 300కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన హిందీ, పంజాబీ సినిమాల్లో అనేక పాత్రలు పోషించారు. బుల్లితెరపైనా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో విశేష ప్రజాదరణ పొందిన మహాభారత్ సీరియల్లో సతీశ్ కౌల్ ఇంద్రుడి పాత్రలో అలరించారు.