వకీల్ సాబ్ విడుదలను అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడింది: విష్ణువర్ధన్ రెడ్డి

10-04-2021 Sat 21:41
  • నిన్న వకీల్ సాబ్ చిత్రం విడుదల
  • బెనిఫిట్ షోలు రద్దు చేసిన ఏపీ సర్కారు
  • టికెట్ రేట్లు పెంచవద్దని హుకుం
  • సర్కారు తీరును ఖండించిన విష్ణు
  • జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని విమర్శలు
Vishnu Vardhan Reddy alleges AP Govt playing dirty politics to stop Vakeel Saab

ఏపీలో వకీల్ సాబ్ చిత్రానికి అడ్డంకులు ఎదురవుతున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. వకీల్ సాబ్ బెనిఫిట్ షోలను రద్దు చేసిన ప్రభుత్వం, టికెట్ల రేట్లను పెంచవద్దంటూ మరో షాకిచ్చింది. దీనిపై విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వకీల్ సాబ్ చిత్రంపై రాష్ట్ర ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అందుకు కారణం తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికేనని తెలిపారు. ఇది కచ్చితంగా జగన్ అధికార దుర్వినియోగమేనని, ఈ వైఖరిని తాను ఖండిస్తున్నానని విష్ణు పేర్కొన్నారు. వకీల్ సాబ్ కు జగన్ భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు.