'కర్ణన్'గా ధనుశ్ దుమ్మురేపేశాడా?
- ధనుశ్ తాజా చిత్రంగా వచ్చిన 'కర్ణన్'
- గ్రామప్రజల హక్కుల కోసం పోరాడే యువకుడి కథ
- విమర్శకుల నుంచి దక్కుతున్న ప్రశంసలు
కలైపులి థాను నిర్మించిన ఈ సినిమా, కోలీవుడ్లోని థియేటర్లను దడదడలాడించేస్తోందట. తన గ్రామ ప్రజల హక్కులను కాపాడటం కోసం పోరాడే యువకుడిగా ఈ సినిమాలో ధనుశ్ కనిపిస్తాడు. కథ అంతా కూడా ఆయన పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అనూహ్యమైన మలుపులు .. ఉద్వేగభరితమైన సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని అంటున్నారు.
ధనుశ్ కెరియర్లో ఇది ఓ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అక్కడి పత్రికలు ఈ సినిమాను ఆల్ టైమ్ క్లాసిక్ గా పేర్కొనడం విశేషం. త్వరలోనే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను పలకరించే అవకాశాలు ఉన్నాయి.