Hyderabad: వనస్థలిపురంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల అదృశ్యం

Three Girls kidnapped in Hyderabad Vansthalipuram
  • అదృశ్యమైన బాలికలు 14  నుంచి 17 ఏళ్లలోపు వారే
  • రమేశ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు
హైదరాబాద్ శివారులోని వనస్థలిపురంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. నిన్న ఉదయం నుంచి తమ కుమార్తెలు ఐశ్వర్య (17), ఆస్మా (15), అబీర్ (14) కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

స్థానిక ప్రగతినగర్‌కు చెందిన రమేశ్, అతడి స్నేహితులపై అనుమానం వ్యక్తం చేశారు. రమేశ్ గతంలో ఐశ్వర్య వెంటపడేవాడని, ప్రేమిస్తున్నానంటూ వేధించేవాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. ఐశ్వర్యను వేధిస్తున్న రమేశ్‌ను గతంలో తాము హెచ్చరించామని కూడా చెప్పారు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. కిడ్నాపైన బాలికల కోసం ఆరా తీస్తున్నారు.
Hyderabad
Vanasthalipuram
Girls
Kidnap

More Telugu News