Dhanush: 'కర్ణన్'గా ధనుశ్ దుమ్మురేపేశాడా?

Dhanush acting is appreciated in Karnan Movie
  • ధనుశ్ తాజా చిత్రంగా వచ్చిన 'కర్ణన్'
  • గ్రామప్రజల హక్కుల కోసం పోరాడే యువకుడి కథ
  • విమర్శకుల నుంచి దక్కుతున్న ప్రశంసలు      
మొదటి నుంచి కూడా ధనుశ్ విభిన్నమైన కథలకు .. విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. గత కొంతకాలంగా ఆయన చేస్తూ వస్తున్న సినిమాలను పరిశీలిస్తే, వైవిధ్యానికి ఆయన పెద్దపీట వేస్తాడనే విషయం అర్థమవుతుంది. అలా తాజాగా ఆయన నుంచి 'కర్ణన్' అనే సినిమా వచ్చింది. సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ  సినిమా, నిన్ననే అక్కడ భారీ స్థాయిలో విడుదలైంది. ధనుశ్ నటనకి జనం వీలైనన్ని విజిల్స్ కొడుతున్నారు. మలయాళ కథానాయిక రాజీషా విజయన్, ఈ సినిమాతో తమిళ తెరకి పరిచయమైంది.

కలైపులి థాను నిర్మించిన ఈ సినిమా, కోలీవుడ్లోని థియేటర్లను దడదడలాడించేస్తోందట. తన గ్రామ ప్రజల హక్కులను కాపాడటం కోసం పోరాడే యువకుడిగా ఈ సినిమాలో ధనుశ్ కనిపిస్తాడు. కథ అంతా కూడా ఆయన పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అనూహ్యమైన మలుపులు .. ఉద్వేగభరితమైన సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని అంటున్నారు.

ధనుశ్ కెరియర్లో ఇది ఓ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అక్కడి పత్రికలు ఈ సినిమాను ఆల్ టైమ్ క్లాసిక్ గా పేర్కొనడం విశేషం. త్వరలోనే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను పలకరించే అవకాశాలు ఉన్నాయి.
Dhanush
Rajisha Vijayan
Yogibaabu
lal

More Telugu News